Exception: from Rule – 48

నీ స్టాక్ పోర్ట్ ఫోలియో లో ఉన్న స్టాక్స్ ఏమిటి ??

ఎప్పుడూ స్టాక్ మార్కెట్ గురించి ఏమీ పట్టించుకోని నా చిన్ననాటి మిత్రుడి ప్రశ్నకు ఉలిక్కి పడ్డాను. నాకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.
ఏమిటీ, వాటిని నువ్వు కూడా కొంటావా?   నా అలవాటు ప్రకారం ఎదురు ప్రశ్నించాను.
ప్రశ్నకు తిరుగు ప్రశ్న సమాధానం అవ్వదు. నాకు సమాధానం కావాలి.. తిరిగి రెట్టించాడు.
నేను ఎప్పటికప్పుడు నా పోర్ట్ ఫోలియో మారుస్తుంటాను కాబట్టి అదినీకు పెద్ద ఉపయోగకరంగా ఉండకపోవచ్చు… కొద్దిగా సున్నితంగా తిరస్కరించాను అనుకొన్నాను.. కాని యాక్టువల్ గా నసిగాను.
అలా నసక్కు. నాకు సమాధానం కావాలి.. నా మిత్రుడు వదల్లేదు.

చెప్పడం రూల్- 48 కు విరుద్ధం అని నేను అంటే, అదేమిటని మరొక ప్రశ్న.

Rule 48: Don’t talk about what you are doing in the markets

“If you want to discuss your trades, do so only after they are closed out and you have taken your profits or losses, but never before.”

స్టాక్ మార్కెట్ లో ఏమి చేస్తున్నావో, నువ్వు ఆ పొజిషన్స్ నుండి బయటకు వచ్చే వరకు వాటిగురించి మట్లాడవద్దు అని దీని అర్ధం.

నువ్వు ఎలాగూ మారుస్తుంటావు కదా,  ఈ ఒక్కసారికీ చెప్పు.. మరింత పట్టు పట్టాడు.

ఇంతకీ ఎలా చెప్పాలి? పేర్లు ఇస్తే సరిపోతుందా లేక ఎందుకో కూడా చెప్పాలా?  అన్న నా ప్రశ్నకు సమాధానం  నాకు ఎందుకో కూడా కావాలి…

ఇంతకీ విషయం ఏమిటంటే, నా మిత్రుడి వేరొక సర్కిల్ లో స్టాక్ మార్కెట్ గురించి, దాని లాభాల గురించి వాడిగా , వేడిగా చర్చలు జరుగుతుంటే, మా వాడు ఏమి పార్టిసిపేట్ చెయ్యలేక పోతున్నాడు. వీడు అర్జంటుగా నా పోర్ట్ ఫోలియో లో స్టాక్స్ తెలుసుకొని, తనకూ స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నట్టు నిరూపించాలి.

స్టాక్ మార్కెట్ అంటేనే ఆమడ దూరంలో ఉండే నా ఫ్రెండ్ లాంటి వారిని కూడ చర్చలలోకి లాగుతున్న మార్కెట్ పరిస్థితులు దేనికి సంకేతమో అని అలోచిస్తున్న నాకు, స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిద్దామని అనుకొని, ఎలా మొదలుపెట్టాలో తెలియని వారిని టార్గెట్ చేసిన కోటక్ సెక్యూరిటీస్ అడ్వర్టైజ్మెంట్  గుర్తుకు వచ్చి, ఎంత బ్రిలియంట్ గా ఈ అడ్వర్టైజ్మెంట్ చేసారో కదా అనిపించింది.

Kotak Securities

“Jaimit Doshi, head of marketing, Kotak Securities, commented, “The stock markets always held a fascination for the lay investor. With a StartNow campaign that is integrated across media, we seek to give the impetus to the investors to trade confidently. It is incumbent on the ‘Best Broker in India’ – Kotak Securities – to give them this reassurance.”

ఈ వీడియో లో మాట్లాడుకున్న పి ఇ గురించి నా ఫ్రెండ్ తో చర్చించాలా వద్దా అని మదనపడి, ప్రస్తుతానికి మాట్లాడక పోవడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నాను.

************************************************************************************

ఇంచుమించు ఇలాంటి రిక్వెస్ట్స్ ఈ బ్లాగ్ చదివిన వారినుండి కూడా వచ్చాయి.  నా / మా పోర్ట్ ఫోలియో ఎలా ఉంటుందో అన్న కుతూహలం  సహజమే అనిపించింది.

సమయం కేటాయించలేని మరికొందరు, వాటిని తెలుసుకొని, మనం కూడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని అనుకొని కూడ అడిగి ఉండొచ్చు.

ఇక్కడే మేము ఇతరులను వారిస్తాము.

1. దయచేసి , మేము చేస్తున్నామనో, లేదా, వేరెవరో ఇన్వెస్ట్ చేస్తున్నారనో, లేదా ఎవరో చెప్పారనో మీరు ఇన్వెస్ట్ చేయవద్దు. మీ రిస్క్ ప్రొఫైల్ అర్ధం చేసుకొని మాత్రమే చేయండి.

2. మరొక ముఖ్య విషయం.. మేము ఎవరికైనా పదే పదే చెప్పే విషయం.. మీరు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేస్తున్న విషయం, స్టాక్ మార్కెట్ రిస్క్స్ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలియ చేసి వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోండి. స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు సహజం. మీరు తగ్గినప్పుడు, మీ కుటుంబ  సభ్యుల ప్రోత్సాహం మీ విజయానికి బాటలు వేస్తుంది.

ఇదే మూలసూత్రంగా, అద్భుతంగా చిత్రీకరింపబడిన “లగే రహో మున్నాభాయి” హిందీ చిత్రం లోని ఒక సన్నివేశాన్ని యూ-ట్యూబ్  వీడియో లో గమనించండి.

Lage Raho Munna Bhai

3. మీకు కొన్ని స్టాక్ టిప్స్ తెలిసాయనో, లేక స్టాక్ మార్కెట్ పై చాలా అవగాహన ఉందనో, లేక మరే కారణం గానైనా సరే, వడ్డీలపై అప్పుచేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయవద్దు. ఈ వడ్డీల ప్రెజర్ లో, ఎక్కువ మరియు తొందరగా రిటర్న్స్ ఆశించి, తప్పులు చేసి, సమయం వృధాతో పాటు అసలు కూడ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ.

నా పోర్ట్ ఫోలియో గురించి మా టీం మెంబర్లకు అవగాహన లేకపోలేదు. మా టీం మెంబర్ల పోర్ట్ ఫోలియోల వివరాలు ఒకరివి వేరొకరికి అవగాహన ఉంది.  ఎవరైనా మార్కెట్ కు దూరంగా వెళ్ళినప్పుడు, లేదా మా సిస్టంస్ లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోబ్లంస్ ఎదురైనప్పుడు, వేరొకరి సహాయం తీసుకుని మా టీం పనిచేస్తారు. ఇది ఒక విధంగా రిస్క్ మిటిగేషన్ ప్రొగ్రాం లో భాగం. అందరి పోర్ట్ ఫోలియోలు ఒక విధంగా ఉండవు. కొన్ని కామన్ స్టాక్స్ ఉండే అవకాశం ఉంది.

నా ఫ్రెండ్ కోరిక మేరకు, ఈ సారికి ఆ రూల్ 48 నుండి డీవియేషన్ అయ్యేందుకు నిర్ణయించుకొన్నాను.

************************************************************************************

సరే అనిచెప్పి ఉపోద్ఘాతం మొదలుపెట్టాను.

మొదటగా అర్ధం చేసుకోవలసిన విషయం, నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లను ఒక వ్యాపారం గా భావిస్తాను.

నా స్టాక్స్ పోర్ట్ ఫోలియో, ఎందుకు, ఎలా అని చెప్పాలంటే, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం  క్లుప్తంగా ముగిస్తాను అనిచెప్పి, నా మిత్రుని అంగీకారానికి ఎదురు చూడకుండా కంటిన్యూ చేసాను.

నా ట్రేడ్స్ ను లేదా ఇన్వెస్ట్మెంట్స్ ను 4 భాగాలుగా విభజిస్తాను.

1. లాంగ్ టర్మ్
2. మీడియం టర్మ్
3. షార్ట్ టర్మ్ (3-5 రోజుల స్వింగ్ ట్రేడ్స్, కొన్ని సార్లు 15-20 రోజుల వరుకు కొనసాగే అవకాశం)
4. ఇంట్రా డే

లాంగ్ టర్మ్ అంటే దాని అర్ధం నేను ఇప్పటిలో వీటిపై ఎటువంటి లాభం ఆశించడం లేదు అని అర్ధం చేసుకోవచ్చు. అలా అని అవి లభాలలో లేవు అని అర్ధం కాదు. లాభమైనా నష్టమైనా నాపై ఎటువంటి ప్రభావం లేకుండా చూసుకుంటాను. నా పోర్ట్ ఫోలియో మొత్తం మారుస్తున్నాను అని నేను ఎప్పుడైనా వ్యాఖ్యానిస్తే, వీటికి మినహాయించి అని దాని అర్ధం.

సాధారణం గా నేను మీడియం టర్మ్ స్టాక్స్ నుండి 30 శాతం లాభం ఆశిస్తాను. ఆపై ఇంకా ఆ స్టాక్ కొత్తగా పెట్టుబడి పెట్ట గలిగే అవకాశంగా భావిస్తే, అప్పటి రేట్ ను నా బయ్ ప్రైస్ గా కన్సిద్డర్ చేసి, కంటిన్యూ చేస్తాను. లేదంటే అప్పటి బయింగ్ కు అనుకూలంగా ఆపర్త్యూనిటీ కనబడితే, పోర్ట్ ఫోలియో మారుస్తాను. లేదంటే లాభాలు స్వీకరించి, బయింగ్ ఆపర్త్యూనిటీ కోసం ఎదురుచూస్తాను. ఇక్కడ ఇనొక విషయం గమనించాలి. కొన్ని స్టాక్స్ ప్రవర్తన నేను ఆశినంచినట్టు ఉండక పోవచ్చు. అందుకే నేను లాభ నష్ఠాలు మొత్తం పోర్ట్ ఫొలియో పై గమనిస్తాను. లాభం లేదా నష్టం స్వీకరించాను అంటే, పొర్ట్ ఫోలియో నుండి ఆ మొత్తానిని జమకట్టొచ్చు.అది ఒక స్టాక్ నుండైనా కావచ్చు లేదా, కొన్ని స్టాక్స్ నుండి కొద్దికొద్దిగానైనా కావచ్చు. అది ఆయా సందర్భాలను పట్టి ఉంటుంది.

కొన్ని సార్లు, ఏమైనా మార్కెట్ వీక్ నెస్ గమనిస్తే, అప్పటి పరిస్తితిని బట్టి ఫ్యూచర్స్ ద్వారా లేదా ఆప్షన్స్ ద్వారా నా పోర్ట్ ఫోలియో స్టాక్స్ ను హెడ్జ్ చేస్తాను.

అలాగే నాకు అనుకూల వాతావరణం అనిపిస్తే, డెరివేటివ్స్ లో షార్ట్ టెర్మ్ ట్రేడ్ చేస్తాను.

ఇంట్రా డే ట్రేడ్స్ నా పోర్ట్ ఫొలియో స్టాక్స్ బయ్ ప్రైస్ తగ్గించుకోవడానికి చేస్తుంటాను.

నా మిత్రుడి కోపం నషాళానికి అంటినట్టుంది!

సోది ఆపి అసలువిషయం చెప్పు… అడగలేదు.. అసహనానికి గురయ్యి అరిచాడు.

స్టాక్ మార్కెట్ లో మన సక్సెస్ ను 60-70 శాతం వరకు ప్రభావితం చేసే అంశాలు సోది అనిపించడం ఆశ్చర్యంగా అనిపించినా, నా భావాలు కప్పిపుచ్చుకొని, ఒక చార్ట్ ఓపెన్ చేశాను.

 

InvestChart

 

This entry was posted in @mythought, జనరల్ డిష్కషన్, స్ట్రేటజీ, Uncategorized. Bookmark the permalink.

1 Response to Exception: from Rule – 48

  1. KLN అంటున్నారు:

    నాలాంటి ఔత్సాహికులకు, ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే వారికి చాలా ఉపయుక్తంగా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s