Fundamental Workshop – 1

ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి స్టాక్ చూసుకొని, కొనుక్కుని, దానిమీద కూర్చోవడమే.. డబ్బు అదే పెరుగుతుంది..

ఈ మాటలు విన్న నేను గట్టి గా నవ్వుకున్నాను. ఈ రోజుకి ఆ మాటలు గుర్తొస్తే నవ్వుకుంటూనే ఉంటాను.

ఏదో ఉంది, ఇంకేదో ఉంది అని పరుగులు ఆపి ఒక్క క్షణం అలోచిస్తే, అవును కదా!! ఇంతకంటే ఏముంది అని అనిపించక మానదు.

************************************************************************************

కోట్ల కొద్దీ డబ్బుతో ప్రపంచం నలుమూలల నుండీ ఇన్వెస్టర్స్, హై స్పీడ్ కంప్యూటర్స్ మరియు టెక్నాలజీలను ఉపయోగిస్తూ ట్రేడర్స్, రక రకాల సర్వీసెస్ మరియు సపోర్ట్ లు అందిస్తూ బ్రోకర్లు, పెయిడ్ మార్కెట్ రిపొర్ట్స్, న్యూస్ లెటర్స్, హాట్ వైర్ న్యూస్లు, ఇంటర్నల్ ట్రేడర్స్, మన దగ్గరున్న డబ్బును వారం రెండు వారాలలోనే రెట్టింపు చేసేస్తామనే రికమండేషన్స్, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి స్ట్రాటజీ లతో ఎంతకీ తరగని యూ ట్యూ బ్ వీడియోలు, ఏ బిజినెస్ ఛానల్ చూసినా నాతో పాటు మిగిలిన వారికి కూడ డబ్బు సంపదించి పెట్టేలా రక రకాల రికమండేషస్ తో టి వి అనలిస్ట్స్..

వీరందరనూ ఎదుర్కుంటూ, వారు వారు సాధించిన ఘనతలను తట్టుకుంటూ, వారంతా మార్కెట్ గనుల నుండి డబ్బు తవ్వుకుపోతున్నారని ఈర్ష్య పడుతూ, నేనెందుకు తవ్వుకోలేకపోతున్నానని మధనపడుతూ, ఇక లాభం లేదు అనుకొంటున్న సమయం లో, అసలు స్టాక్ మార్కెట్ లో, ఒక స్టాక్ యొక్క ధర ఎందుకు పెరుగుతుంది, లేదా ఎందుకు తగ్గుతుంది అనే ప్రశ్న తలెత్తింది.

ఇక పరుగు దాని వెనుక మొదలై, కొద్ది కొద్దిగా మార్కెట్ అవగాహన వచ్చాక, టి వి లో బిజినెస్ చానెళ్ళ జోలికి, రికమండేషన్స్ జోలికి వెళ్ళడం మానుకున్న నాకు, అనుకో కుండా టి వి 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం  చూడడం జరిగింది.

అప్పుడప్పుడూ క్రికెట్, ఆదివారం తెలుగు సినిమా మాత్రమే టి వి లో చూసే  అలవాటున్న నాకు, ఆరోజు  ఆ ప్రోగ్రాం నుండి వినబడిన మాటలవి..

“ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి స్టాక్ చూసుకొని, కొనుక్కుని, దానిమీద కూర్చోవడమే.. డబ్బు అదే పెరుగుతుంది..”

ఈ ప్రొగ్రాం ఏదో బాగున్నట్టుందే అనుకుంటూ కొన్ని రోజులు చూశాను. ఉదయాన్నే వాకింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి దగ్గర నేర్చుకున్న సుదర్శన క్రియ చేసుకున్న తరువాత, మార్కెట్ వార్తలు తెలుగులో విందామనుకొన్న నాకు, వారు స్క్రోలింగ్ లో చూపే ఏక్సిడెంట్ వార్తలు చూసి, డిస్ట్రబ్ అవ్వడం మొదలెట్టాను. నావల్ల కాదులే అనుకొని, టి వి కి దూరంగా జరిగి హేపీ గా ఉన్న నాకు, టి వి – 5 మనీ రూపం లో ఆ ప్రొగ్రాం మళ్ళీ దగ్గరయ్యింది.

లైవ్ స్ట్రీమింగ్ టెక్నాలజీ పై ప్రోజెక్ట్ చేద్దామనుకొన్న నా మిత్రుడు రిఫర్ చేయడంతో టి వి-5 మనీ , ప్రాఫిట్ యువర్ ట్రేడ్ రెండూ సబ్స్క్రైబ్ చేశాను.

వారి సేవలు నిజం గా అభినందనీయం.

వారు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో భాగం గా 12 మార్చ్, 17 నాడు ఫండమెంటల్ వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నామంటూ చేసిన ప్రకటన చూసి, ఇంత తక్కువ ధరలో ఎలా కండక్ట్ చేయ గలుగుతున్నారో అని ఆశ్చర్య పోతూ, ఆ వర్క్ షాప్ ప్రోగ్రాం కు రిజిస్టర్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరాను.

కొందరి మిత్రుల కోరిక మేరకు, నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ పొందు పరుస్తాను. నాతో పాటు అటెండ్ ఐన మిత్రులు, ఇక్కడ చదవడం జరిగితె, నేనేమైనా పోయింట్స్ మర్చిపోతే, తెలియ చేయవలసిందిగా మనవి.

కాని, మళ్ళీ ఎక్కడైనా వారు వర్క్ షాప్ కండక్ట్ చేస్తే మీరు మిస్ కాకుండా అటెండ్ అవ్వాలని నా సూచన. నేను కూడ మళ్ళీ అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాను.

ఎందుకంటే, ఇలాంటి క్వాలిటీ వర్క్ షాప్స్ అరుదుగా లభిస్తాయి. అదీ, ఆ ధరలో.. అన్ ఇమేజినబుల్..

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to Fundamental Workshop – 1

  1. Veera Brahmam అంటున్నారు:

    Hi Surya, Great to know many things. Thanks for sharing the valuable information. Warm Regards, Veera Brahmam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s