3 steps to your Holy Grail (of Stock Market Investing)

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Affluence

మిత్రులకు ఒక విన్నపం.

ఏక్టివ్ పోస్ట్ చేసి చాల కాలం అయ్యింది.


తిరిగి మొదలు పెడుదాం అని అలోచించే సమయంలో, కొంతమంది మిత్రులు యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవలసినదిగా సూచన చేయడం జరిగింది.

ఇందుకోసమై Affluence పేరుతో ఒక ఛానల్ మొదలుపెట్టాను.

మిత్రులు ఆ ఛానల్ ను Subscribe చేసి ఆదరించి, మీరు కూడా ఆ ఛానల్ నుండి లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.

ఆ ఛానల్ Welcome వీడియో :

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

#TaaS

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Happy New Year 2018

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Happy Diwali

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

PYT Workshop-Vizag

హైదరాబాద్  వర్క్ షాప్ వివరాలు తెలియబరుస్తానన్న నాకు, కొందరు మిత్రులు ఆ వివరాలు తెలియజేయ వలసిందిగా మెస్సేజ్ లు, ఈ మైల్స్ పంపారు. వారికి ఆలస్యానికి క్షమాపణలు చెబుతూనే , ఇదిగో అదిగో అంటూ వూరిస్తూ, 3 నెలలు గడిపేసినా , ఇంకా కాగితం పై కలం పెట్టలేదు. ఇక క్షమించమనే అర్హత కూడ కొల్పోయినట్టే కనబడుతోంది..

ఈ లోపుగా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ , టి వి 5 మనీ వారు, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం లలో కూడ వర్క్ షాప్స్ ముగించేసారు.

వారు ఫిక్స్ చేసిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ చూసి, ఎగిరి గంతేస్తూ, 2017, జూన్ 10, 11 తేదీలలో విశాఖపట్నం లో నిర్వహించబడ్డ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యాను.

చాల గొప్పగా సాగిన వర్క్ షాప్ చివరలో అటెండీస్ అందరినీ ఒక గ్రూప్ గా ఏర్పడమని, వారిలో వారిని చర్చించుకొమ్మని నిర్వాహకులు సూచించిన వెంటనే, కొందరి వుత్సాహవంతుల సపోర్ట్ తో అందరూ ఒక వాట్స్ ఏప్ గ్రూప్ గా ఫార్మ్ అయ్యి, అప్పుడే కొందరు వారి వారి అభిప్రాయాలను తెలియ చేస్తూ, అందర్నీ సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు.  స్నబ్ధగా ఉండిపోకుండా, నా వంతు దండయాత్ర, నేను కూడ మెస్సేజెస్ రూపంలో మొదలుపెట్టాను. ఇది ఆరంభ శూరత్వం కాదనే భావిస్తున్నాను. ఈ పరిచయం ఒక కొత్త ఊత్సాహాన్నిస్తోంది. ఈ పరిచయం ఒక మీనింగ్ ఫుల్ దిశగా, అందరమూ  అభివృద్ది పధం లోకి  వెళ్ళ గలిగేదిగా సాగాలని ఆశిస్తున్నాను.

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల, సంవత్సరం క్రితం బెంగళూరు నుండి విశాఖపట్నం వచ్చి, ఇక్కడ ఎవరైనా మార్కెట్ ఇంటెరెస్టెడ్ ప్యూపుల్ కలుస్తారా అన్న అనుమానం తో ఉన్న నాకు, ఇంతమందిని ఒకే సారి పరిచయం చేసిన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వారికి ధన్యవాదాలు.

***********************************************************************************

ఇక మన ట్రాకింగ్ విషయానికి వస్తే, మనం తరచుగా తలచుకునే డాలెక్స్ – 30 లెవెల్స్ చూసుకుంటే, మనం గీసుకున్న రెడ్ లైన్ ను దాటి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Fundamental Workshop – 1

ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి స్టాక్ చూసుకొని, కొనుక్కుని, దానిమీద కూర్చోవడమే.. డబ్బు అదే పెరుగుతుంది..

ఈ మాటలు విన్న నేను గట్టి గా నవ్వుకున్నాను. ఈ రోజుకి ఆ మాటలు గుర్తొస్తే నవ్వుకుంటూనే ఉంటాను.

ఏదో ఉంది, ఇంకేదో ఉంది అని పరుగులు ఆపి ఒక్క క్షణం అలోచిస్తే, అవును కదా!! ఇంతకంటే ఏముంది అని అనిపించక మానదు.

************************************************************************************

కోట్ల కొద్దీ డబ్బుతో ప్రపంచం నలుమూలల నుండీ ఇన్వెస్టర్స్, హై స్పీడ్ కంప్యూటర్స్ మరియు టెక్నాలజీలను ఉపయోగిస్తూ ట్రేడర్స్, రక రకాల సర్వీసెస్ మరియు సపోర్ట్ లు అందిస్తూ బ్రోకర్లు, పెయిడ్ మార్కెట్ రిపొర్ట్స్, న్యూస్ లెటర్స్, హాట్ వైర్ న్యూస్లు, ఇంటర్నల్ ట్రేడర్స్, మన దగ్గరున్న డబ్బును వారం రెండు వారాలలోనే రెట్టింపు చేసేస్తామనే రికమండేషన్స్, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి స్ట్రాటజీ లతో ఎంతకీ తరగని యూ ట్యూ బ్ వీడియోలు, ఏ బిజినెస్ ఛానల్ చూసినా నాతో పాటు మిగిలిన వారికి కూడ డబ్బు సంపదించి పెట్టేలా రక రకాల రికమండేషస్ తో టి వి అనలిస్ట్స్..

వీరందరనూ ఎదుర్కుంటూ, వారు వారు సాధించిన ఘనతలను తట్టుకుంటూ, వారంతా మార్కెట్ గనుల నుండి డబ్బు తవ్వుకుపోతున్నారని ఈర్ష్య పడుతూ, నేనెందుకు తవ్వుకోలేకపోతున్నానని మధనపడుతూ, ఇక లాభం లేదు అనుకొంటున్న సమయం లో, అసలు స్టాక్ మార్కెట్ లో, ఒక స్టాక్ యొక్క ధర ఎందుకు పెరుగుతుంది, లేదా ఎందుకు తగ్గుతుంది అనే ప్రశ్న తలెత్తింది.

ఇక పరుగు దాని వెనుక మొదలై, కొద్ది కొద్దిగా మార్కెట్ అవగాహన వచ్చాక, టి వి లో బిజినెస్ చానెళ్ళ జోలికి, రికమండేషన్స్ జోలికి వెళ్ళడం మానుకున్న నాకు, అనుకో కుండా టి వి 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం  చూడడం జరిగింది.

అప్పుడప్పుడూ క్రికెట్, ఆదివారం తెలుగు సినిమా మాత్రమే టి వి లో చూసే  అలవాటున్న నాకు, ఆరోజు  ఆ ప్రోగ్రాం నుండి వినబడిన మాటలవి..

“ఇదేమీ బ్రహ్మ విద్య కాదు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి స్టాక్ చూసుకొని, కొనుక్కుని, దానిమీద కూర్చోవడమే.. డబ్బు అదే పెరుగుతుంది..”

ఈ ప్రొగ్రాం ఏదో బాగున్నట్టుందే అనుకుంటూ కొన్ని రోజులు చూశాను. ఉదయాన్నే వాకింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి దగ్గర నేర్చుకున్న సుదర్శన క్రియ చేసుకున్న తరువాత, మార్కెట్ వార్తలు తెలుగులో విందామనుకొన్న నాకు, వారు స్క్రోలింగ్ లో చూపే ఏక్సిడెంట్ వార్తలు చూసి, డిస్ట్రబ్ అవ్వడం మొదలెట్టాను. నావల్ల కాదులే అనుకొని, టి వి కి దూరంగా జరిగి హేపీ గా ఉన్న నాకు, టి వి – 5 మనీ రూపం లో ఆ ప్రొగ్రాం మళ్ళీ దగ్గరయ్యింది.

లైవ్ స్ట్రీమింగ్ టెక్నాలజీ పై ప్రోజెక్ట్ చేద్దామనుకొన్న నా మిత్రుడు రిఫర్ చేయడంతో టి వి-5 మనీ , ప్రాఫిట్ యువర్ ట్రేడ్ రెండూ సబ్స్క్రైబ్ చేశాను.

వారి సేవలు నిజం గా అభినందనీయం.

వారు ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో భాగం గా 12 మార్చ్, 17 నాడు ఫండమెంటల్ వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నామంటూ చేసిన ప్రకటన చూసి, ఇంత తక్కువ ధరలో ఎలా కండక్ట్ చేయ గలుగుతున్నారో అని ఆశ్చర్య పోతూ, ఆ వర్క్ షాప్ ప్రోగ్రాం కు రిజిస్టర్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరాను.

కొందరి మిత్రుల కోరిక మేరకు, నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ పొందు పరుస్తాను. నాతో పాటు అటెండ్ ఐన మిత్రులు, ఇక్కడ చదవడం జరిగితె, నేనేమైనా పోయింట్స్ మర్చిపోతే, తెలియ చేయవలసిందిగా మనవి.

కాని, మళ్ళీ ఎక్కడైనా వారు వర్క్ షాప్ కండక్ట్ చేస్తే మీరు మిస్ కాకుండా అటెండ్ అవ్వాలని నా సూచన. నేను కూడ మళ్ళీ అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాను.

ఎందుకంటే, ఇలాంటి క్వాలిటీ వర్క్ షాప్స్ అరుదుగా లభిస్తాయి. అదీ, ఆ ధరలో.. అన్ ఇమేజినబుల్..

Posted in Uncategorized | 1 వ్యాఖ్య

Respect History

నిఫ్టీ నూతన రికార్డ్ హై తాకిన సందర్భం గా మార్కెట్ పార్టిసిపేంట్స్  అందరికీ శుభాకాంక్షలు.

సెన్సెక్స్ నూతన హై చేరుకోవాలంటే, ఇంకా రమారమి మూడు శాతం పెరగాల్సి ఉంది.
అదే విధంగా డాల్లెక్స్-30, 4430 ను దాటి నూతన హై చేరుకోవాలంటే, ప్రస్తుత 3652 నుండి, 21.3% పెరగాల్సి ఉంది.  సెన్సెక్స్ 3000 పోయింట్స్ మించి పెరగాలి.

అంటే నిజానికి, మన మార్కెట్స్ హై గా కనబడుతున్నా, అవి నూతన హై లు కావని భావించ వచ్చు.

అలా అని, నూతన ఇన్వెస్టర్స్ ఆగ్రసివ్ గా ఇన్వెస్ట్ చేయకుండా , కొంచెం జాగ్రత్తగా, ఆచి తూచి స్టాక్స్ పిక్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఎవరికైనా పొజిషన్స్ ఉంటే, వాటిని హోల్డ్ చేసుకుని, నూతనం గా పెట్టుబడి పెట్టేందుకు, కొంచెం వేచి ఉండడం లేదా రెండు మూడు ధరల వద్ద కొనేలా స్ట్రేటజీ  పెంపొందించు కోవడం మంచిది.  కొంచెం తక్కువ లాభాన్ని ఆశించడం ఉత్తమం.

కాని డాల్లెక్స్ 3600 దాటిన తరువాత మార్కెట్ లో వెల్లివిరిసే యూఫోరియా ను ఎదుర్కొని, అవకాశాలు కోల్పోతున్నమేమో అనే బాధను తట్టుకుని, డబ్బు దగ్గర పెట్టుకొని, ఓపికగా ఎదురుచూడగలిగిన సత్తా ఎంతమందిలో ఉంది?

ఈ జాగ్రత్త ఎందుకంటే, పెరుగుతూ ఉండి, ఎంతవరకూ పెరుగుతుందో అనే అనుమానం కలిగించే సెన్సెక్స్, డాలర్ టర్మ్  లోకి వచ్చే పాటికి, ప్రక్కదారిలోనే కదులుతోంది.

డాల్లెక్స్30, 3600 దాటిన తరువాత కొంచెం ఎక్స్పెన్సివ్ జొన్ లోకి వస్తున్న మార్కెట్స్, 10 శాతం దూరంలో ఉన్న 4000 (ప్రస్తుత సెన్సెక్స్ కు రమారమి 1500 పోయింట్స్ దూరంలో)  దాటిన తరువాత వెరీ ఎక్స్పెన్సివ్ జొన్ లో ఉంటున్నట్టు చరిత్ర చెబుతోంది.

మనం చరిత్రను గౌరవించుకొందామా?

 

Posted in @mythought | వ్యాఖ్యానించండి

Happy New Year 2017

happy-new-year-17 dollex_20161230

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Words of Buddha

remembering-budda

Posted in Uncategorized | వ్యాఖ్యానించండి